ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డుల పరిధిలో సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన సర్వే పత్రాలను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ శనివారం అందజేశారు. సమగ్ర కుటుంబ సర్వే ఇంటింటికి తిరిగి నిర్వహించాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు కౌన్సిలర్లు , కాంగ్రెస్ నాయకులు తిరుపతి తదితరులు ఉన్నారు.