జాతీయ బీసీ యువజన సంఘం కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో శనివారం మునిసిపల్ ఆఫీస్ దగ్గర నిరుద్యోగ తెలంగాణ పేరుతో నిరసన దీక్ష చేపట్టనున్నట్టు జిల్లా యూత్ అధ్యక్షులు రాజీవ్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా, ఉద్యోగం , ఉపాధి కల్పన దిశగా యువత పట్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిరసన దీక్ష చేస్తున్నమన్నారు. ఈ కార్యక్రమానికి అఖిలపక్ష నాయకులు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.