ఎల్లారెడ్డి పట్టణంలోని మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టాక్ రిజిష్టర్ ను పరిశీలించారు. ఎంతమంది విద్యార్థినిలు ఉన్నారు అనే విషయాన్ని వసతి గృహ నిర్వాహకురాలితో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంట గదిని పరిశీలించి, విద్యార్థినులకు వండిన అన్నంను స్వయంగా పరిశీలించారు.