నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూరు గ్రామంలో స్మశానవాటిక ఏర్పాటుకు తహశీల్దార్ శ్రీనివాస్, మాజీ జడ్పిటిసి మనోహర్ రెడ్డి తో కలిసి స్థలాన్ని పరిశీలించినట్లు ఆత్మకూరు మాజీ సర్పంచ్ గడ్డం బాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ గ్రామంలో స్మశాన వాటికకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని, స్మశానవాటిక ఏర్పాటు కోసం జిల్లా నుండి మండల స్థాయి అధికారుల వరకు వినతులు ఇచ్చామన్నారు. చివరకు తహశీల్దార్ స్పందించారన్నారు.