రాష్ట్రంలోని మినీ, మెయిన్ అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వం పెంచిన వేతనాలు 5 నెలల నుంచి చెల్లించాలని కోరుతూ.. సోమవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబాకు అంగన్వాడి టీచర్లు వినతి పత్రం అందచేశారు. ఎమ్మెల్యేకు వినతి ఇచ్చి ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయేలా చూడాలని కోరారు. అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్ సంఘం లీడర్ దేవకర్ణ నాయకత్వంలో వినతిపత్రం అందించారు.