ఎల్లారెడ్డి మండలంలో 31 జీపీల పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించిన సర్వే పత్రాలను, శనివారం ఎంపీడీఓ అతినారపు ప్రకాష్ ఎన్యుమరేటర్లకు అందజేశారు. ఎంపీడీఓ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా గత రెండు రోజుల క్రితం కుటుంబాల గుర్తింపు, కుటుంబ యజమాని పేరు, ఇంటి నంబర్ తో కూడిన స్టిక్కర్లను అతికించడం జరిగిందన్నారు.