కామారెడ్డి జిల్లాజాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా మంజులను నియమించినట్లు జిల్లా అధ్యక్షులు కాముని సుదర్శన్ శనివారం తెలిపారు. బీసీల సామాజిక ఎదుగుదలకు మహిళా సాధికారతకు కృషి చేయాలని ఆమెకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ యూత్ జిల్లా అధ్యక్షులు రాజీవ్ కుమార్, యూత్ ప్రధాన కార్యదర్శి అఖిల్ రావు, యూత్ నాయకులు నిఖిల్ , ఇర్ఫాన్, గంగాధర్, మాల మహానాడు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నాగమణి పాల్గొన్నారు.