రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శనివారం ఎల్లారెడ్డి మండలంలోని 31జీపీల పరిధిలో మున్సిపాలిటీలోని 12వార్డుల్లో ప్రారంభమైందని ఎంపీడీఓ అతినారపు ప్రకాష్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేసిన ఇంటింటి కుటుంబ సర్వే ఫారాలతో ఎన్యూమరేటర్లకు కేటాయించిన జీపీల్లో, మున్సిపల్ వార్డుల్లో సర్వేను ప్రారంభించారు.