ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులోని దేవున్ పల్లికి చెందిన నాగం రాధ తీవ్ర అనారోగ్యంతో చికిత్స కోసం హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చేరారు. సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ శనివారం ఆసుపత్రికి వెళ్లి రాధ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎల్లారెడ్డి సెగ్మెంట్ ప్రాంత రోగులను వెళ్లి కలుసుకొని, వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు.