ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఇంటింటి కుటుంబసర్వే వివరాలను ఎన్యుమరేటర్లు తప్పులు లేకుండా నమోదు చేయాలని ఎల్లారెడ్డి ఆర్డీఓ సూచించారు. శనివారం ఎల్లారెడ్డి మున్సిపల్ లోని 12 వార్డుల్లో ప్రారంభమైన ఇంటింటి కుటుంబ సర్వే నమోదు కార్యక్రమాన్ని ఆర్డీఓ స్థానిక మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, కమిషనర్ శ్రీహరి రాజు, తహశీల్దార్ అల్లం మహేందర్ కుమార్ లతో కలిసి పరిశీలించారు. పనితీరు బాగుందన్నారు.