జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత ఆదేశాల మేరకు తాడ్వాయి మండల యూత్ అధ్యక్షునిగా భాస్కర్ కురుమని నియమించినట్లు జిల్లా యూత్ అధ్యక్షులు రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ కుమార్ మాట్లాడుతూ బీసీలు అన్ని రంగాల్లో జనాభా ప్రాతిపాదికన తమ వాటా కోసం ఉద్యమించాలని యువకులు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి అఖిల్ రావు జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మంజుల సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రవీణ్ పాల్గొన్నారు.