ప్రజావాణిలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదులను పంపి పరిష్కారం అయ్యే విధంగా చూడాలన్నారు.