బిచ్కుందలో బిఆర్ఎస్ నాయకుల రాస్తారోకో
బిచ్కుంద మండల కేంద్రంలో ఏకకాలంలో రైతు భరోసా, రైతు రుణమాఫీ చెయ్యాలని కోరుతూ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఆదివారం రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న గాని, రైతు భరోసా ఖరీఫ్‌లో గాని, రభీలో గాని ఇంతవరకు చెల్లించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు అద్దంపడుతోందని బీఆర్ఎస్ నేతలు అన్నారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, రైతులు పాల్గొన్నారు.