దోమకొండ పంచాయతీ కార్యదర్శిగా యాదగిరి శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పంచాయతీ సిబ్బంది శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. పిట్లం గ్రామపంచాయతీ కార్యదర్శిగా యాదగిరి పనిచేసి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సకాలంలో గ్రామపంచాయతీకి ఇంటి పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.