బిచ్కుంద మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న వైన్స్ పర్మిట్ రూమ్‌ను వెంటనే తొలగించాలని బీజేవైఎం నేతలు బుధవారం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎక్సైజ్ సీఐకి, ఎస్సై కి, బిచ్కుంద తహసీల్దార్ కు బీజేవైఎం యువమోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రాలను అందజేశారు. బస్టాండ్ సమీపంలో ఉన్న వైన్స్ వల్ల మహిళలు, విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.