కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల చెరువు గ్రామ శివారులో ఆదివారం రాత్రి రెండు గంటలకు బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామం నుండి ఇసుకను ఆక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మద్దెల చెరువు గ్రామంలో పిట్లం ఎస్ఐ రాజు పట్టుకుని ఇసుక తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.