పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందడి బలరాం రెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందడంతో మంగళవారం జుక్కల్ నియోజక వర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పిట్లం కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాంపూర్(కలన్) గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.