బాన్సువాడ పట్టణంలోని హన్సి ప్రియ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి ఆదివారం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, పట్టభద్రుల సమస్యలను శాసన మండలిలో తన గొంతు వినిపిస్తానన్నారు. శాసనమండలి రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా తయారైందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రులు, తదితరులు పాల్గొన్నారు.