తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో శనివారం ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ మాట్లాడుతూ.. నిన్నటి వరకు గ్రామంలో హౌస్ హోల్ మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. ఇవాళ నుండి కుటుంబ వివరాలను సేకరించడం ప్రారంభించినట్లు తెలిపారు.