బాన్సువాడ నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 50% నుండి 53% పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి గురువారం ధన్యవాదాలు తెలిపిన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మాండ్లు. ఆయన మాట్లాడుతూ దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు 3% డిఏ కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గత ఏడాది కూడా ఇదే సమయంలోనే ఉద్యోగుల డిఏ ను 4% పెంచింది. ఈ నిర్ణయంతో కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లాభం చేకూరానుందన్నారు.