కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొత్తబాది గ్రామంలో బుధవారం తాపీ మేస్త్రీల సమావేశం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు పాల్గొని తాపీ మేస్త్రీల గురించి మాట్లాడటం జరిగింది. తాపీ మేస్త్రీలు, నిర్మాణ రంగాల కార్మికులు లేబర్ కార్డును యూనియన్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి తీసుకోవాలని ఆయన తెలిపారు.