టీచర్స్ భవన్ కోసం మంత్రికి వినతి

63பார்த்தது
టీచర్స్ భవన్ కోసం మంత్రికి వినతి
ధర్మపురి నియోజకవర్గంలో టీచర్స్ భవన నిర్మాణం కొరకు తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు గురువారం క్యాంప్ కార్యాలయంలో టీచర్స్ భవన్ సాధన సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తీర్థం అయిన మన ధర్మపురి పట్టణం రాష్ట్ర, దేశ స్థాయిలో మన్ననలు పొందిన ఉపాధ్యాయులను అందించిన పట్టణం అని మన ధర్మపురి నియోజకవర్గంలో వందల మంది ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారన్నారు.

டேக்ஸ் :