మహా సంగ్రామానికి వేళైంది. ఇవాళ్టి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మే 25వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ మెగా టోర్నీలో కొన్ని రికార్డులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు (175), అత్యధిక సిక్సర్లు (357) బ్యాటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్నాయి. ఈ రికార్డులను ఏ ఆటగాడు బ్రేక్ చేస్తాడో వేచి చూడాలి. కోల్‌కతా వేదికగా ఇవాళ రా.7.30 గంటలకు కోల్‌కతా, బెంగళూరు మ్యాచ్ ఉండనుంది.