మునగాకు తీసుకోవడం వల్ల ప్రతి సీజన్‌లో మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మునగాకులో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే విటమిన్ సి, ప్రొటీన్, ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. బలహీనత, అలసట లేకుండా చేస్తుంది. మునగాకు రసం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపడంలో సహాయపడుతుంది.