పచ్చళ్లు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. అయితే ఎక్కువగా తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చళ్లలో ఉప్పు, నూనె, మసాలాలు ఎక్కువగా ఉండటం వల్ల ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ మొత్తంలో నిత్యం తీసుకుంటూ ఉంటే పొట్టలో, పేగులలో అల్సర్ సమస్యలు ఏర్పడతాయి. అయితే పచ్చళ్ళు తక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదని నిపుణులు సూచిస్తున్నారు.