చక్కెర లేకుండా కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చక్కెర వేయకుండా కాఫీ తాగితే గుండె జబ్బులు తగ్గుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. జీవక్రియను పెంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా లివర్‌కు సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.