AP: కూటమి సర్కార్ పై ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘11 సీట్లు ఉంటే ప్రతిపక్షం రాదంటున్నారు. కానీ.. 40 శాతం ఓట్లు వచ్చాయనేది మర్చిపోతున్నారా?. నలుగురు ఎంపీలున్నారు..11 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇతర ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు మాజీ సీఎం వైఎస్ జగన్‌కి 2 నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తామంటే ఎలా?' అని అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు.