భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి పార్టీ ఆదేశానుసారం రాజ్యాంగాన్ని స్వీయసమర్పణ చేసుకుంటున్నట్లు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్, మల్లెల నర్సింగ్ రావు, తదితరులు పాల్గొన్నారు.