వికారాబాద్ జిల్లా కొడంగల్ పశు వైద్యశాలలో జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. జంతు జనన కేంద్రం ఏర్పాటుతో కుక్కల బెడద నుంచి ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బాలరాం నాయక్, పశు వైద్య జిల్లా అధికారి సదానందం, డాక్టర్ నోహ, అతిరామ్, పరమేష్, సుజాతలి, పర్సాపూర్ మాజీ సర్పంచ్ సయ్యద్ అంజాద్ పాల్గొన్నారు.