సికింద్రాబాద్: కానిస్టేబుల్ కుటుంబాలు రోడ్డెక్కాయి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రేవంత్ రెడ్డి పాలనలో పోలీస్ కానిస్టేబుల్ కుటుంబాలు రొడ్డెక్కాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం బీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, నాడు కేసీఆర్ కానిస్టేబుల్ లను మనుషులుగా చూస్తే, నేడు రేవంత్ వారిని మరమనుషులుగా చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో హోంమంత్రి లేరు, రేవంత్ దగ్గరే హోంశాఖ ఉంది. కానిస్టేబుల్స్ విషయంలో రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి అని అన్నారు.