తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులతో బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ 'చలో సచివాలయం' ర్యాలీ ఉద్రిక్తతల నడుము సాగుతోంది. నిరుద్యోగులు భారీగా బండి వెంట తరలి రావడంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. మరోవైపు పోలీసులు 'గో బ్యాక్' అంటూ నిరుద్యోగులు నినాదాలు చేస్తున్నారు. తాను ఎలాగైనా సచివాలయం వెళ్లి తీరుతానని, సీఎంకు వాస్తవాలు వివరిస్తానని బండి సంజయ్ తెలిపారు.