లాలాగూడ: చెత్త వేయడానికి ఇంటి నుంచి వెళ్లిన మహిళ అదృశ్యం
చెత్త వేయడానికి ఇంటి నుంచి వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లాలాపేటలోని శాంతినగర్ లో నివాసముండే నల్ల కిరణ్ కు నల్ల నాగరాణితో వివాహమైంది. ఈ నెల 4వ తేదీన సాయంత్రం అయిదు గంటలకు చెత్త వేసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. చుట్టుపక్కల వాకబు చేసిన ఫలితం లేకపోవడంతో పోలీసు స్టేషన్ లో బుధవారం ఫిర్యాదు చేశాడు.