అగ్నిపథ్ పథకంలో భాగంగా సికింద్రాబాద్లోని ఈఎంఈ సెంటర్లో అగ్నివీర్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది. న్యూ ట్రైనింగ్ మెథడాలజీ విధానాన్ని లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేతు గురువారం పరిశీలించారు. కఠిన పరిస్థితులను సైతం దీటుగా ఎదుర్కునేందుకు ఈ నూతన టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర మిలిటరీ అధికారులు పాల్గొన్నారు.