పోలీస్ అధికారుల ఆదేశాలు మేరకు సికింద్రాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు ఆధ్వర్యంలో బోయిన్ పల్లి ట్రాఫిక్ పోలీసులు పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ఈ మేరకు మంగళవారం బోయిన్ పల్లిలో విద్యార్థులకు వాయు కాలుష్యం, హెల్మెట్, సీటు బెల్టు ధరించడం, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఉల్లంఘన, రహదారి భద్రతా నియామలపై అవగాహన కల్పించారు.