బోయిగూడా వెటర్నరీ హాస్పిటల్ వెనక గల్లీలో ఎలాంటి అనుమతి లేకుండా వేస్తున్న బోర్ను శుక్రవారం సికింద్రాబాద్ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. తహశీల్దార్ కార్యాలయం నుంచి 4.5 కు అనుమతి పొంది అక్రమంగా 6.5 బోర్ వేస్తున్న ఘటనపై స్థానికులు చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నట్లు తహశీల్దార్ పాండు నాయక్, సర్వేయర్ కిరణ్ తెలిపారు. అనుమతి లేని అక్రమ బోర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.