చిన్న సహాయాలు గొప్ప మార్పులు తీసుకొస్తాయని బీజేవైఎం నేషనల్ ట్రెజరరీ సాయి అన్నారు. సోమవారం యాప్రాల్ కు చెందిన ఉమకు టీం సాయి సభ్యులు సహాయం చెక్కును అందజేశారు. ఇటీవల ఆమె భర్త చనిపోవడంతో ముగ్గురు కూతుర్ల చదువుకు అండగా నిలిచారు. తమ సమస్యలను టీమ్ సాయి దృష్టికి తీసుకురావడంతో సోమవారం రూ. 15 వేల చెక్కును అందజేశారు.