ప్రజలకు ఏ కష్టం వచ్చిన రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ డివిజన్ ప్రజలకు హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం డివిజన్ పరిధిలోని మైత్రీవనం కాలనీ, రాత్రెడ్డి కాలనీ, నాగిరెడ్డి కా లనీలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్క రించాలని బస్తీవాసులు వినతి పత్రాలు ఇచ్చారు.