బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈనెల 29న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం బీఆర్ఎస్ భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, గోషామహల్ నియోజకవర్గం నాయకులు ఆశిష్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.