కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా గురువారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివాసీ యోధుడు, అరణ్య సూర్యుడు, పోరాటాల గడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దు బిడ్డ
కొమురం భీమ్ అని కొనియాడారు. కేటీఆర్ వెంట పలువురు బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు.