కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ. వివేకానందని కలిసి పలు వినతులు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తానని అన్నారు.