అడిక్మెట్ డివిజన్లో రూ. 7 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు పనులను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బుధవారం ప్రారంభించారు. రోడ్డు పనులు చేపట్టాలని ప్రజలు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రతిపాదనలు తయారు చేసి పనులు మంజూరు చేయించామని తెలిపారు. ఈ కొత్త రోడ్డు నిర్మాణంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తెలిపారు.