మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఓ కళాశాలలో చదువుతున్న గణేష్ అనే విద్యార్థి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. జలసాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని పలువురు దగ్గర అప్పులు చేసి బెట్టింగ్ యాప్ లలో డబ్బులు పోగొట్టుకొని తిరిగి అప్పులు తీర్చే లేక ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు తెలిపారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన గణేష్, తల్లి సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.