మల్కాజిగిరి: ధోబి ఘాట్ పునర్నిర్మించండి: ఎమ్మెల్యే
మల్కాజిగిరి సర్కిల్ పరిధి జ్యోతినగర్ 856 సర్వే నంబర్లోని ధోబిఘాట్ సమస్యపై నేడు తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చర్చించారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో రజకుల జీవనాధారమైన దోబీ ఘాట్ పునర్నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే, ఎమ్మార్వోకు సూచించారు. రజకుల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తానని రజకులకు హామీ ఇచ్చారు.