మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్ లో అబద్దాలు పెట్టారని అన్నారు. అంతేకాకుండా ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసారని మండిపడ్డారు. రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పమని మహారాష్ట్రలో చెప్పాల్సి ఉండే అన్నారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ డబ్బులు వాడుతున్నారని ఆరోపించారు.