సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారుల కుటుంబ సభ్యులకు కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గానికి చెందిన 27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 9, 68, 500 విలువ గల చెక్కులను అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన వారు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు.