కూకట్ పల్లిలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి సోమవారం భారీగా చేరికలు జరిగాయి. బాలానగర్ డివిజన్లో కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను గులాబి కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వాగతించారు. కాంగ్రెస్తో అభివృద్ధి జరగదని, మళ్లీ కేసీఆర్ రావాలని బీఆర్ఎస్ యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేరారు.