జనసేన పార్టీ ఆఫీసులో ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు

681பார்த்தது
జనసేన పార్టీ ఆఫీసులో ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు
తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్ లోగల జనసేన పార్టీ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ , గ్రేటర్ హైదరాబాద్ జనసేన పార్టీ అధ్యక్షుడు రాధారం రాజలింగం పాల్గొని జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ... ముందుగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చైతన్యానికి సెలవు, విప్లవాలకు కొలువు. తెలంగాణ, ప్రపంచంలోనే పేరుగాంచిన సాయుధ పోరాటానికి జన్మనిచ్చిన పురిటి గడ్డ తెలంగాణ. అలాంటి ఈ పుణ్యభూమికి సంపూర్ణ స్వేచ్ఛ లభించిన రోజు సెప్టెంబర్ 17, విమోచన దినోత్సవం. బానిస సంకెళ్లు మరుపురాని దినం. తెలంగాణ వాసులందరికీ పండుగ దినం. నవాబుల అండదండలతో తెలంగాణ ప్రజలను, మహిళలపై అఘాయిత్యాలు చేసిన రజాకార్ల పై పోరాడిన చాకలి ఐలమ్మ, దొడ్ల కొమరయ్య, ఇతర పోరాట వీరులను శ్రుతించుకొని వారికి జోహార్లు తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణ విమోచన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాబోయే ఎలక్షన్లని దృష్టి పెట్టుకుని హడావుడి చేయడం బాధాకర విషయమని, ఇకనైనా అధికారంగా ప్రకటించి రాబోయే రోజుల్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా చేయాలని అన్నారు. అదేవిధంగా జనసేన సైనికులు ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామములో ఘనంగా రోజుల్లో చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సెక్రటరీ మండలి దయాకర్, కూకట్పల్లి నియోజకవర్గం కెపిహెచ్బి కాలనీ 114 జనసేన పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు కొల్లా శంకర్, వెంకటేశ్వరరావు, నాగరాజు, గ్రేటర్ హైదరాబాద్ జనసైనికులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி