గోషామహల్ లో భారీగా కుంగిన రోడ్డు
హైదరాబాద్ గోషామహల్ లో భారీగా కుంగిన నాలా రోడ్డు. దారుస్సలామ్ నుండి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో ప్లైవుడ్ దుకాణాల ముందు కుంగిన నాలా రోడ్డు. మంగళవారం అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో కుంగిన సివరేజ్ పెద్ద నాలా. అర్ధరాత్రి ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. అతి పురాతనమైన నాలా కావడంతో కుంగినట్లుగా స్థానికులు చెబుతున్నారు . 200 మీటర్ల దూరంలో గతంలో కూడా అదే నాలా కుంగినట్లుగా స్థానికులు చెబుతున్నారు.