హైదరాబాద్: కేసీఆర్ కుటుంబం అవినీతిపై రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర
మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిపై తక్షణమే విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో డిసెంబర్ 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నట్లు అధ్యక్షుడు నరాల సత్యనారాయణ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ బషీరాబాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. కాలేశ్వరం ప్రాజెక్టులో వేలకోట్ల అవినీతి జరిగిందని, ఈడీ అధికారులు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.