మరోసారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్
ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్షించకుండా తనను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఆదివారం పోలీసులు మరోసారి ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతకాలం తనను అణచివేయడానికి ప్రయత్నిస్తారని పోలీసులను ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు పెట్టిన అతి త్వరలో ఆలయాన్ని సందర్శించి మాత ముత్యాలమ్మ ఆశీస్సులు పొందుతానని స్పష్టం చేశారు.